Site icon NTV Telugu

Nithya Menon: నిత్యా టాలీవుడ్‌ను మర్చిపోయిందా..?

Nitya Menon

Nitya Menon

కెరీర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండేళ్ల నుండి దూరంగా ఉంటోంది న్యాచురల్ టీ నిత్యామీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు ఈ కేరళ కుట్టీ కం కన్నడ కస్తూరీ. తిరుచిత్రాంబలంతో భారీ హిట్టు అందుకున్న నిత్యా.. ఈ సినిమాలో ఫెర్ఫామెన్స్‌కు జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఇక అప్పటి నుండి తమిళ తంబీలతోనే టచ్‌లో ఉంటూ.. టాలీవుడ్ ఫ్యాన్స్‌తో దూరంగా ఉంటోంది. రీసెంట్లీ జయం రవి సరసన కాథలిక్క నేరమిల్లే చేసింది నిత్యా. కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ మేడమ్ చేతిలో త్రీ తమిళ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. తిరు తర్వాత ధనుష్ సరసన మరోసారి జోడీ కడుతోంది ఈ బొద్దుగుమ్మ. ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తోంది.

Suriya Vs Karthi: సూర్య, కార్తీ బాక్సాఫీస్ వార్?

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అయ్యేది. కానీ షూటింగ్ డిలే కావడంతో అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయ్యింది. ధనుష్‌తోనే కాకుండా విజయ్ సేతుపతితో మరోసారి జోడీ కడుతోంది ఈ స్టార్ బ్యూటీ. ఈ ఇద్దరు గతంలో 19(1)(a)మలయాళ ప్రాజెక్ట్ చేశారు. ప్రజెంట్ చేస్తున్న సినిమాకు పసంగ ఫేమ్ పాండిరాజ్ దర్శకుడు. రీసెంట్లీ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. టైటిల్ ఎనౌన్స్ మెంట్ మిగిలి ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ డియర్ ఎక్సెస్ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీని ఎనౌన్స్ అయ్యింది. ఇందులో ప్రతీక్ బబ్బర్, నవదీప్, వినయ్ రాయ్, దీపక్ పరంబోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప.. మరో అప్డేట్ లేదు. ఇంతకు సినిమా ఉందో లేదో..? మళ్లీ ? తెలుగులో నిత్యా ఎప్పుడు అడుగుపెడుతుందో ఏంటో..?

Exit mobile version