Site icon NTV Telugu

Harshavardhan Rameshwar : హర్షవర్ధన్ రామేశ్వర్‌కి క్రేజీ ఆఫర్‌లు!

Harshavardhan Rameshwar

Harshavardhan Rameshwar

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమ‌ల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(BGM)తో సినిమా స్థాయిని పెంచడంలో సిద్ధహస్తులు. అయితే, తెలుగులో రామేశ్వర్ ప్రతిభను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అన్న అభిప్రాయం చాలా మంది సంగీతాభిమానుల్లో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌కు వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన రెండు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. మొదటిది, వెంక‌టేష్ – త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా. ఈ మెగా కాంబినేషన్‌కు హర్షవర్ధన్ సంగీతం అందించనుండటం అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. రెండోది, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం. ఇందులో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.

Also Read : Niharika NM:సినిమాల్లో నటించడం నాకు కొత్త.. చాలా ఎంజాయ్ చేశా!

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి పనిచేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు గ్రహీత, ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో పాపులరైన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిసిన న్యూ జనరేషన్ మ్యూజిక్ను ఆశించవచ్చు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్‌ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్త కాంబినేష‌న్స్ సెట్ అయిన‌ప్పుడు, సంగీతం కూడా కొత్త‌గా, విభిన్నంగా వినే ఛాన్స్ ఉంటుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్న ఈ రెండు క్రేజీ సినిమాల ఆల్బ‌మ్స్ కోసం సంగీతాభిమానులు ఇప్ప‌టి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Exit mobile version