పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత రత్నం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పర్మిషన్ వచ్చేసింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్ సహా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జీవో జారీ అయింది.
Also Read:Mumbai: ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
జీవో లెక్కల ప్రకారం ముందు రోజు 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ వేసుకోవచ్చు. దానికి 600 ప్లస్ జీఎస్టీ మొత్తం కలిపి 708 రూపాయలు టికెట్ రేట్‌గా ఫిక్స్ చేశారు. ఇక తర్వాత ప్రతి రోజు ఉండే నాలుగు షోలతో పాటు ఒక షో అదనంగా వేసుకోవచ్చని మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 150 రూపాయలు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు. ఇక 28 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లో కూడా 150 రూపాయలు పెంచే అవకాశం కల్పించారు.
Also Read:MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..
ఇక ఈ లెక్క ప్రకారం వీకెండ్‌లో సింగిల్ స్క్రీన్‌లో 350, మల్టీప్లెక్స్‌లో 531 రూపాయలు అయితే, అదే ఐదో రోజు నుంచి 11వ రోజు వరకు మల్టీప్లెక్స్‌లో 472, సింగిల్ స్క్రీన్‌లో 324 రూపాయలు వరకు అమ్ముకునే అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రేట్లు అమలు కానున్నాయి. అయితే పుష్ప తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే హరిహర వీరమల్లు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో తాము ప్రభుత్వాన్ని కోరినట్లు గతంలో రత్నం ప్రకటించారు.
