మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం.
అయితే హరిహర వీరమల్లు భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఈ క్రేజ్ సరిపోదు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే డిస్కషన్ జరగాలి. అలా చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలి. ఇప్పడు ఆ దిశగానే ప్లానింగ్ జరుగుతోంది. అందుకోసం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల టాలీవుడ్ లో జరిగిన కొన్ని పరిణామాలు పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్ సినీ పెద్దలు ఏపీ సీఎం ను కలవకపోవడం పట్ల కూడా పవర్ స్టార్ కాస్త అసంతృప్తి గానే ఉన్నారు. మరి వీటన్నిటికి గురించి హరిహర వేదికపై స్పందిస్తారా అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది. మరో 10 రోజుల్లో జరగబోయే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.