హరి హర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఖుషి, బంగారం తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం , పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుండడంతో అభిమానుల హంగామా ఓ రేంజ్ లో చేస్తున్నారు.
Also Read : Shocking : పీవీఆర్ సెంట్రల్ లో ‘కుబేర’ సినిమా పైరసీ
అయితే నిర్మాత ఏ ఎం రత్నం గత చిత్రాలు ప్లాప్ కావడంతో ఆ సినిమాలు కొనుగోలు చేసిన బయ్యర్లు తమకు నష్టపరహారం చెల్లించాలని లేఖలు విడుదల చేసారు. దాంతో నైజాం లో ఈ సినిమా రిలీజ్ కు ఎవైన అడ్డంకులు వస్తాయేమో అని భావించారు. కానీ ఈ వివాదాన్ని టి కప్పులో తుపానులా ముగించేశారు. అందుకోసం టాలీవుడ్ బడా నిర్మాతలు ముగ్గురు రంగంలోకి దిగారు. హరిహరవీరమల్లు కి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మరియు సితార ఎంటెర్టైన్మెంట్స్ తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరికి చెందిన నిర్మాతల ఇందులో పాలుపంచుకుని అన్ని సమస్యలను పరిష్కరించేసారు. పవన్ గత సినిమా బ్రో సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక నైజాం ఏరియాను మైత్రీ మూవీస్ సంస్థ పంపిణి భాద్యతలు తీసుకుంది. సితార ఆంధ్ర ఏరియాలో విడుదలకు సహకారం అందిస్తోందని సమాచారం. పవన్ తో ససత్సంబాలు కలిగియున్న నేపధ్యంలో ఈ ముగ్గురు నిర్మాతలు చక్రం తిప్పారని టాక్.న
