పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బిగ్ అప్‌డేట్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఎన్నో డిలేస్ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. మొదట మే 9 అని అధికారికంగా అనౌన్స్ చేసినా, షూటింగ్ జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే ముగిసింది కాబట్టి, అంత తొందరగా రిలీజ్ చేయడం కాస్త కష్టమే. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ సినిమా జూన్ 12, 2025న థియేటర్స్‌లో సందడి చేయబోతోంది!
Read More:JSJ -1 : జాసన్ సంజయ్ – సందీప్ కిషన్ స్టార్ట్ చేసారు
ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ లీడింగ్ టికెట్ సెల్లింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో జూన్ 12 డేట్‌తో “కమింగ్ సూన్” అంటూ ఫైర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే హైప్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. 2020లో అనౌన్స్ అయిన హరిహర వీరమల్లు షూటింగ్‌లో కోవిడ్ పాండమిక్, పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్స్ వల్ల బోలెడు డిలేస్ ఫేస్ చేసింది. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో షూటింగ్ కాస్త స్లో అయింది. అయినా, 2024 సెప్టెంబర్‌లో విజయవాడలో సెట్‌లో షూటింగ్ రీస్టార్ట్ అయ్యి, మే 6, 2025 నాటికి ఫైనల్‌గా వ్రాప్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్, VFX, డబ్బింగ్ వర్క్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది.
Read More:JSJ -1 : జాసన్ సంజయ్ – సందీప్ కిషన్ స్టార్ట్ చేసారు
పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో వీరమల్లుగా కనిపించబోతున్నాడు. బాబీ డియోల్ మొగల్ బాద్‌షా ఔరంగజేబ్‌గా విలన్ రోల్‌లో కనిపిస్తారు. నిధి అగర్వాల్ లీడ్ హీరోయిన్‌గా, అనుపమ్ ఖేర్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. డైరెక్షన్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కాంబోలో జరిగింది. సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు, ఇప్పటికే “మాట వినాలి”, “కొల్లగొట్టినాదిరో” సాంగ్స్ రిలీజ్ అయి ట్రెండ్ అయ్యాయి.