ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న (జులై 24, 2025) విడుదల కానున్న ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు కోరగా, ప్రభుత్వం మొదటి పది రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. హరి హర వీరమల్లు చిత్ర నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి కోరారు. అయితే, ప్రభుత్వం ఈ అభ్యర్థనను పరిశీలించి, మొదటి పది రోజులకు మాత్రమే ధరల పెంపును అనుమతించింది. 23న రాత్రి 9గంటలకు రూ.600 టికెట్ ధరతో ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు.
ALso Read:AM Ratnam: హరి హర వీరమల్లు కల్పిత పాత్ర.. ప్రెజర్ ను బాధ్యతగా ఫీల్ అవుతున్నా!
ఆమోదించిన ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి:
అప్పర్ క్లాస్ (సింగిల్ స్క్రీన్ థియేటర్లు): రూ.150 పెంపు
మల్టీప్లెక్స్ థియేటర్లు: రూ.200 అదనపు ధర
17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ధీరోదాత్తమైన యోధుడిగా కనిపించనున్నారు. ఈ ధరల పెంపు ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో నేరుగా తనను సంప్రదించకుండా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా, రత్నం ఫిల్మ్ ఛాంబర్‌కు అధికారిక దరఖాస్తు సమర్పించగా, అది ప్రభుత్వానికి చేరి, ఆమోదం పొందింది. క్రిష్ జాగర్లముడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరి హర వీరమల్లు ఒక భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఎం. రత్నం ప్రెజెంటర్.
ALso Read:MEGA 157 : లీక్‌లపై ‘మెగా 157’ టీమ్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ ..
నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్‌లతో అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. జులై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకులు, రాజకీయ ప్రముఖులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణలో కూడా నిర్మాత ఎ.ఎం. రత్నం టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేశారు. సంధ్యా థియేటర్‌లో ఇటీవల జరిగిన ఘటన కారణంగా ప్రీమియర్ షోలు మరియు ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ, సినిమా చారిత్రక నేపథ్యం మరియు ఉన్నత నిర్మాణ విలువలను దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
