Site icon NTV Telugu

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ లాంచ్

HanuMan has launched with a formal Pooja Ceremony

‘జాంబీరెడ్డి’తో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్‌ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ను లాంఛనంగా ఆరంభించాడు. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన హ‌ను-మాన్ టైటిల్, టైటిల్ టీజ‌ర్ కి చక్కటి స్పందన లభించింది.

Read Also : సమంత నటించిన శృంగార సన్నివేశాలు… ‘ఆ కారణం’గానే తొలగించారట!

మన పురాణాలు, ఇతిహాసాల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. నిజానికి సూపర్‌హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. ఇక
హనుమాన్ మ‌న భారతీయులకు సూపర్ హీరో.అలాంటి హ‌ను-మాన్ కథతో ఈ సినిమా పూజతో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్తపు షాట్‌కి నిర్మాత సి. క‌ల్యాన్ క్లాప్ కొట్టగా మ‌రో నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విఛాన్ చేశారు. శివ‌శ‌క్తి ద‌త్త గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. జులై నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్పణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version