Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి, డిజాస్టర్ ‘టాక్సిక్’ తో పోలుస్తున్నారు నెటిజన్లు. ‘టాక్సిక్’ ను 450 కోట్ల బడ్జెట్ తో తీస్తే 400 కోట్లకు అమ్మారు. అయితే 342 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ‘హనుమాన్ అంశ్’ను రెండు కోట్లతో తీస్తే ఇప్పటివరకు 366 కోట్ల గ్రాస్, 200 కోట్ల షేర్ రాబట్టింది. సక్సెస్ అంటే ‘హనుమాన్ అంశ్’లా ఉండాలి. ఆగస్టు 7న రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. లాంగ్ రన్ అంటే ఇది, లాభాలంటే ఇలా ఉండాలి అంటూ ‘హనుమాన్ అంశ్’ను నెటిజన్లు ఇండైరెక్ట్ గా ‘టాక్సిక్’ మేకర్స్ కు చెప్తున్నారు.
బాలీవుడ్ మూవీ ‘హనుమాన్ అంశ్’లో పేరున్న నటీనటులు లేకపోయినా, కథలోని నిజాయితీ, బలమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేసింది. కథే అసలైన హీరోగా భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఈ సినిమా ఒకటి వస్తుంది అన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. థియేటర్స్ కూడా దొరకలేదు. కేవలం పాజిటివ్ మౌత్ టాక్ తో హిట్ అందుకుంది. ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా బయోపిక్ గా ‘హనుమాన్ అంశ్’ రూపొందింది. ఆయన జీవితాన్ని సింపుల్ గా, హృదయాన్ని హత్తుకునేలా చూపించడంతో వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నేటితరం యువత కనెక్ట్ అయ్యేలా సినిమాను డైరెక్ట్ చేశాడు విశాల్ చతుర్వేది.
Also Read
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
- Comrade Kalyan : 'కామ్రేడ్ కళ్యాణ్' వాయిదా ?
‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన మొదటి రోజు 10 లక్షలు మాత్రమే వచ్చింది. ఫస్ట్ వీక్ లో కోటి 8 లక్షలు మాత్రమే రాగా, రెండో వారంలో పరిస్థితి చేయి దాటిపోయి 40 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమా పనైపోయింది అన్నారు. రెండు వారాల్లో కోటి 48 లక్షలు వసూలు చేయగా, ఇక థియేటర్స్ లో బొమ్మ తీసేయడమే తరువాయి అనుకున్నారు అంతా. మూడో వారంలో ఒక్కసారిగా పికప్ అయి 10.4 కోట్లు రాబట్టింది. నాలుగో వారంలో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఆ తర్వాత 100, 200, 300 కోట్ల మార్కును అలా అలవోకగా దాటేసింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘హనుమాన్ అంశ్’ను చూడాలన్న తెలుగు ప్రేక్షకుల కల మాత్రం తీరడం లేదు. త్రివిక్రమ్ తెలుగు రైట్స్ కొని 18న రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ, ఉన్నట్టుండి త్రివిక్రమ్ డ్రాప్ కావడంతో తెలుగు వర్షన్ థియేటర్స్ లోకి రావడం లేదు. ‘హనుమాన్ అంశ్’ను చూడాలి అన్న తెలుగు ఆడియన్స్ కల ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!