Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaitanya Reddy: పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘హనుమాన్’ సినిమా సీక్వెల్ వివాదం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దంపతులు నిర్మించిన తాజా చిత్రం ‘శ్రీమతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ వివాదంపై ఆసక్తికర చర్చ జరిగింది. సీక్వెల్ రైట్స్ విషయంలో తొలిసారి నిర్మాత చైతన్య రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వేడుకలో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో ‘హనుమాన్ 2’ ప్రాజెక్ట్‌పై ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ‘హనుమాన్’ ఐపీ రైట్స్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు చెందినవని, అలాగే ఈ ప్రాజెక్ట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో సెటిల్మెంట్ జరిగిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందని ప్రస్తావించారు. దీనిపై చైతన్య రెడ్డి ఏమాత్రం తడబడకుండా సూటిగా సమాధానమిచ్చారు. “హనుమాన్ ఎవరి సొంతం కాదు.. మా దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అలాగే ఇరువర్గాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తమకు, వాళ్లకు మధ్య రూ.23 కోట్ల సెటిల్మెంట్ జరిగిన మాట వాస్తవమేనని, అయితే అది వేరే విషయాలకు సంబంధించినది మాత్రమేనని స్పష్టం చేశారు. అంతమాత్రాన పార్ట్-2 తీసుకునే రైట్స్ తాము వాళ్లకు ఇచ్చేసినట్లు కాదని కుండబద్దలు కొట్టారు. అయితే ‘శ్రీమతి’ వేదికపై ఇండస్ట్రీ రూమర్స్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని ఆమె.. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ‘శ్రీమతి’ సినిమాపైనే ఉందని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్, ఇతర విషయాల గురించి పూర్తి వివరాలు కావాలంటే పర్సనల్‌గా తమ ఆఫీస్‌కు వస్తే కూర్చుని మాట్లాడుకుందామని ఆ జర్నలిస్ట్‌ను ఆహ్వానించారు.
Also Read
- Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
- Rajini - Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
- Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
- Box Office Collections: నవంబర్‌లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సందడి.. డ్రై సీజన్‌ను హిట్ల సీజన్‌గా మార్చిన సినిమాలు!
మరోవైపు, ఇదే వేదికపై తన భర్త నిరంజన్ రెడ్డి స్వభావం గురించి చైతన్య రెడ్డి చెప్పిన మాటలు ప్రస్తుత వివాదానికి మరింత ఆసక్తిని జోడించాయి. యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. “మా ఆయన ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మేస్తారు. ఎదుటివాళ్లు ఏ ఇంటెన్షన్‌తో మనతో మాట్లాడుతున్నారో అస్సలు ఆలోచించరు. అందుకే ఆయన ఏ పని చేస్తానని చెప్పినా నేను ముందు ‘వద్దు’ అని చెప్తూ ఉంటాను” అని ఓపెన్‌గా చెప్పారు. భర్త మంచితనం వల్ల జరిగే నష్టాలను ప్రస్తావిస్తూనే, సినిమా రైట్స్ విషయంలో తాము లీగల్‌గా ఎంత పక్కాగా ఉన్నామో ఆమె తన మాటల ద్వారా స్పష్టం చేశారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ‘శ్రీమతి’ సినిమా డిసెంబర్ 4న జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా వేడుకలో చైతన్య రెడ్డి పేల్చిన ‘హనుమాన్ డాక్యుమెంట్స్, రూ.23 కోట్ల సెటిల్మెంట్’ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
-
Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!