Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘హనుమాన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తాజాగా ప్రకటించి టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద వివాదం దాగి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీసేటప్పుడు హీరో, దర్శకుడు మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ అసలు కథ వేరే ఉంది. ఈ ప్రాజెక్టులో హీరోగా పంజా వైష్ణవ్ తేజ్, దర్శకుడిగా విఐ ఆనంద్ పేర్లను నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రకటించారు. అయితే, అసలు ‘హనుమాన్’ సిరీస్ ఇంట్లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (IP Rights) మొదటి నుంచీ దర్శకుడు ప్రశాంత్ వర్మ వద్దే ఉన్నాయి. హక్కులు లేకుండానే నిరంజన్ రెడ్డి ఈ సీక్వెల్‌ను ఎలా ప్రకటించారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
‘హనుమాన్’ విడుదలైన తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డికి, హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మకు మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తేజ సజ్జా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టగా, ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో, రిషబ్ శెట్టి హీరోగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో నిరంజన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తన వద్ద అడ్వాన్స్ తీసుకున్న ప్రశాంత్ వర్మ, వేరే బ్యానర్లో సినిమా చేయడానికి వీల్లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆ మొత్తం తన పాత బకాయిల్లో భాగమే తప్ప, కొత్త సినిమా అడ్వాన్స్ కాదని ప్రశాంత్ వర్మ వాదించారు. ప్రతిష్టాత్మకమైన ‘జై హనుమాన్’ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగి ఈ వివాదాన్ని సెటిల్ చేసింది. నిరంజన్ రెడ్డికి 23 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు, ప్రైమ్ షో బ్యానర్లో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘ఆక్టోపస్’ సినిమాను కూడా తామే టేకోవర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read
ఈ సెటిల్మెంట్ ప్రకారం, ‘హనుమాన్’ సిరీస్‌కు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టే అధికారం ప్రైమ్ షో సంస్థకు లేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ‘హనుమాన్ 2’ ప్రకటన రావడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సినిమాను అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే, అసలు ఈ వివాదం గురించి తెలిసి కూడా వైష్ణవ్ తేజ్, దర్శకుడు విఐ ఆనంద్ ఈ ప్రాజెక్టులోకి ఎలా అడుగుపెట్టారన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ‘హనుమాన్ 2’ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!