Site icon NTV Telugu

Gymkhana : మళ్లీ నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్

Harish Shankar

Harish Shankar

మలయాళంలో బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్‌ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీకి ఖలీద్‌ రెహమాన్‌ దర్శకత్వం వహించాడు. జాబిన్‌ జార్జ్‌, సమీర్‌ కారత్‌, సుభీష్‌ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్‌ డ్రామాకు నిర్మించగా.. ఈ సంద‌ర్భంగా అగ్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ మూవీ తెలుగా  ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. అయితే..

ఇండస్ట్రీ ఏదైనప్పటికి మనం ఎక్కడ ఉన్న మన స్థాయి మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇలా నోరు జారి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు షెడ్ కెలిపోతున్నారు. ఇందులో దర్శకుడు హరీష్ శంకర్ ఒకరు.. మూవీస్ విషయం పక్కన పెడితే ఏ ఈవెంట్‌కి వెలినా కూడా ఏదో మాట అంటూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ‘జింఖానా’ మూవీ ఈవెంట్‌లో కూడా ఇదే జరింగింది.

Also Read: Nani : చిరంజీవి-శ్రీకాంత్‌ ఓదెల ప్రాజెక్ట్ పై అప్ డెట్ ఇచ్చిన నాని..

‘పక్క సినిమాల్ని ఎగరేసుకుంటూ వెళ్లి చూస్తారు. తెలుగు సినిమాలు పట్టించుకోరు’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఇక ఈ వ్యాఖ్యల మీద నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క భాషల సినిమాలు రీమేక్ చేసే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా? .. అసలు మంచి సినిమాలు తీసే చేత కాదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడతావా? అంటూ.. భాష ఏదైనా సరే సినిమా మంచిగా ఉంటే మేము హిట్ చేస్తాం అడగడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ‘తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు కాకుండా పక్క సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారని అంటున్నారు.. మీ సినిమా ఎంకరేజ్ చేసి హిట్ చేసింది కూడా తెలుగు జనాలే అని మర్చిపోయారా’.  మంచి సినిమా తీస్తే.. అది ఎవ్వరి సినిమా అయినా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. బాగా లేని సినిమా ఏ భాషలో తీసినా కూడా తెలుగు జనాలు పట్టించుకోరు. అంటూ ఫైర్ అవుతున్నారు.

Exit mobile version