ప్రముఖ రాజకీయ నాయకుడు, పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో కన్నడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన పోస్టర్, మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
Also Read : Pawan Kalyan: వైద్య సేవలో నిర్లక్ష్యంగా ఉండకండి.. డిప్యూటీ సీఎం సిరీస్..!
గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తోంది. ఆయన లుక్, సాదాసీదా వేషధారణ, భుజంపై ఎర్ర కండువా, పాత సైకిల్, వెనుక అసెంబ్లీ భవనం.. ఇలా ప్రతి అంశం ఎంతో సహజంగా, అథెంటిక్‌గా ఉంది. మోషన్ పోస్టర్‌లో ఇతర ఎమ్మెల్యేలు కార్లలో అసెంబ్లీకి వస్తుంటే, గుమ్మడి నర్సయ్య మాత్రం తన సైకిల్‌పై రావడం హైలైట్‌గా నిలిచింది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా అమరింది. నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
