Site icon NTV Telugu

Gulshan Devaiah: సమంత హీరోగా కాంతార విలన్

Gulshan

Gulshan

బాలీవుడ్‌లో తనదైన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ పాత్రలకు పేరుగాంచిన గుల్షన్ దేవయ్య.. ఇటీవల బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ సెకండ్ పార్ట్ (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)లో విలన్ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ భాగమవడం అతనికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

Also Read:Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా‌!

గుల్షన్ దేవయ్య.. ఎట్టకేలకు ఇప్పుడు టాలీవుడ్‌లోకి ప్రవేశించబోతున్నాడు. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకునే గుల్షన్.. టాలీవుడ్‌లో తన మొదటి ప్రాజెక్ట్‌గా సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పేరు ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య.. సమంత సరసన ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను సమంతతో నటించడానికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, గుల్షన్ దేవయ్య టాలీవుడ్ ప్రయాణానికి మంచి ఆరంభాన్నిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version