NTV Telugu Site icon

shocking : విడాకులు తీసుకున్న మరొక స్టార్ కపుల్.. కారణం ఏంటంటే..?

Untitled Design (33)

Untitled Design (33)

మరొక స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు  అధికారకంగా ఓ లేఖ విడుదల చేశాడు జయం రవి. ఆ లేఖలో  ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం, నా సినీ ప్రయాణంలో నా అభిమానులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు నా జీవితంలోని  ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకోవాలి.

Also Raed : Thalapathy Vijay : దర్శకుడిగా తమిళ విజయ్ కొడుకు.. హీరోగా మన తెలుగు కుర్రాడే..

అనేక సమాలోచనలు మరియు చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాను.ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు.  ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను మరియు ఈ విషయంలో ఎలాంటి ఊహలు, పుకార్లు లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను” అని రాసుకొచ్చారు.  16 ఏళ్ల రవి, ఆర్తి వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. టిక్ టిక్ టిక్ సినిమాలోని కన్నయ్య సాంగ్ లో ఉన్నది జయం రవి కొడుకే.  రేపు అనగా సెప్టెంబరు 10న జయం రవి పుట్టిన రోజు కావడం కొసమెరుపు. ఈ హీరో నటించిన బ్రదర్ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

Show comments