NTV Telugu Site icon

Govinda: గన్ సీజ్.. ఆడియో మెసేజ్ రిలీజ్ చేసిన గోవింద

Govinda Firing Case

Govinda Firing Case

Govinda Firing Case Health Update: బాలీవుడ్ నటుడు గోవింద (60) కాలికి బుల్లెట్ గాయమైంది. తన సొంత రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ పేలినప్పుడు గోవింద రివాల్వర్‌ను అల్మారాలో ఉంచాడు. అయితే ఆపరేషన్ అనంతరం అతని కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద ఒక్కడే ఉన్నాడని డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు. గోవింద వద్ద లైసెన్స్ రివాల్వర్ ఉంది. ప్రమాదవశాత్తు రివాల్వర్ బుల్లెట్ అతని కాలికి తగిలింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయంలో అనుమానాస్పదంగా ఏమీ లేదు. ఇక ఘటన తర్వాత ముంబై పోలీసులు గోవింద రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Pawan Kalyan: కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విచారణ నిమిత్తం ముంబై పోలీసులు మధ్యాహ్నం అతని ఇంటికి చేరుకున్నారు. ఇక గోవిందకు బుల్లెట్ తగలడంతో కాలు నుంచి రక్తం కారినట్లు సమాచారం. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అంధేరిలోని కృతి కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రికి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ప్రాథమిక చికిత్స తర్వాత, గోవింద ప్రమాదం నుండి బయటపడ్డారు. అతని కూతురు టీనా (నర్మద) ప్రస్తుతం అతనితో పాటు ఆసుపత్రిలో ఉంది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా బాబా ఖతుశ్యామ్‌ను సందర్శించేందుకు జైపూర్‌కు వెళ్లారు. ఇక మరోపక్క గోవింద ఆసుపత్రి నుండి ఆడియో సందేశాన్ని విడుదల చేసి ‘’మీ ఆశీస్సులతో నేను బాగున్నాను. పొరపాటున బుల్లెట్ పేలింది, ఆపరేషన్ తర్వాత అది తొలగించబడింది. మీ అందరికీ, మీ ప్రార్థనలకు, వైద్యులకు ధన్యవాదాలు అంటూ ఆయన రాసుకొచ్చారు.

Show comments