Govinda: గన్ సీజ్.. ఆడియో మెసేజ్ రిలీజ్ చేసిన గోవింద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govinda Firing Case Health Update: బాలీవుడ్ నటుడు గోవింద (60) కాలికి బుల్లెట్ గాయమైంది. తన సొంత రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ పేలినప్పుడు గోవింద రివాల్వర్‌ను అల్మారాలో ఉంచాడు. అయితే ఆపరేషన్ అనంతరం అతని కాలు నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం నటుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద ఒక్కడే ఉన్నాడని డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు. గోవింద వద్ద లైసెన్స్ రివాల్వర్ ఉంది. ప్రమాదవశాత్తు రివాల్వర్ బుల్లెట్ అతని కాలికి తగిలింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయంలో అనుమానాస్పదంగా ఏమీ లేదు. ఇక ఘటన తర్వాత ముంబై పోలీసులు గోవింద రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Pawan Kalyan: కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
విచారణ నిమిత్తం ముంబై పోలీసులు మధ్యాహ్నం అతని ఇంటికి చేరుకున్నారు. ఇక గోవిందకు బుల్లెట్ తగలడంతో కాలు నుంచి రక్తం కారినట్లు సమాచారం. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అంధేరిలోని కృతి కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రికి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ప్రాథమిక చికిత్స తర్వాత, గోవింద ప్రమాదం నుండి బయటపడ్డారు. అతని కూతురు టీనా (నర్మద) ప్రస్తుతం అతనితో పాటు ఆసుపత్రిలో ఉంది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా బాబా ఖతుశ్యామ్‌ను సందర్శించేందుకు జైపూర్‌కు వెళ్లారు. ఇక మరోపక్క గోవింద ఆసుపత్రి నుండి ఆడియో సందేశాన్ని విడుదల చేసి ‘’మీ ఆశీస్సులతో నేను బాగున్నాను. పొరపాటున బుల్లెట్ పేలింది, ఆపరేషన్ తర్వాత అది తొలగించబడింది. మీ అందరికీ, మీ ప్రార్థనలకు, వైద్యులకు ధన్యవాదాలు అంటూ ఆయన రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!