సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మృతి చెందిన రేవతికి ఇప్పటికే అల్లు అర్జున్ పాతిక లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని మరొక 15 లక్షల ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయితే మరొక పక్క సుకుమార్ భార్య తబిత కూడా ఇప్పటికే ఐదు లక్షలు అందించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తరఫున పాతిక పాతిక లక్షలు ఆర్థిక సాయం చేయబోతున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు. రేవతి కుమారుడు శ్రీ తేజ్ చిన్ననాటి నుంచే అల్లు అర్జున్ అభిమాని. అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో తండ్రిని పుష్ప సినిమా తీసుకువెళ్లాలంటూ ముందు నుంచి కోరుతూ వచ్చాడు. కుమారుడి అభిమానాన్ని కాదనలేక శ్రీ తేజ తండ్రి సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో టికెట్లు కొనుగోలు చేశారు.
Revanth Reddy: థియేటర్లోనే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తే కానీ అల్లు అర్జున్ కదల్లేదు!
అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలియక కుటుంబంతో సహా ప్రదర్శనకు వెళ్లారు. కుమార్తెతో పాటు రేవతి భర్త ఉండగా రేవతి, రేవతి కుమారుడు ఒకపక్క ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట ఏర్పడడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీ తేజ మాత్రం స్పృహ కోల్పోయాడు. తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్లగా కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. అప్పటినుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో శ్రీ తేజ చికిత్స పొందుతున్నాడు ముందుగా సినిమా టీం తరఫున అలాగే అల్లు అర్జున్ టీం శ్రీ తేజ ఖర్చులు భరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ప్రభుత్వం తరఫున శ్రీ తేజ చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తున్నట్టు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. ఇక ఇప్పుడు రేవతి కుటుంబానికి పాతిక లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం గమనార్హం.