అతడో స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్ని చాల బాగుంటాయ్ కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో నాలుగు సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్టు ఉంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలాని హిట్టు ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే రెండు రెండు సినిమాలు రెండు దారుణ పరాజయాలు. అయిన సరే మనోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా అతడే రాధాకృష్ణ.
Also Read: Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ ‘రైట్స్’ కొనుగోలు చేసింది ఎవరంటే..?
జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు రాధాకృష్ణ కుమార్. 2015లో గోపిచంద్ హీరోగా వచ్చిన జిల్ యావరేజ్ గా నిలిచింది. గోపీచంద్ లుక్స్, స్టైల్ బాగుంది అనే పేరు తప్ప సినిమాలో విషయం లేదని తేల్చేసారు ఆడియెన్స్. ఇక రెండవ సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఒక్క ఫైట్ కూడా లేకుండా ఎక్కడ మల్లి ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో అని ఫ్లాప్ అవడానికి కావలసిన వేసుకుని తీసిన సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజగా రాధాకృష్ణ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అసలే హిట్లు లేక సతమతమవుతున్న హీరో గోపిచంద్. జిల్ రూపంలో తనకి ఫ్లాప్ ఇచ్చిన మరోసారి రాధాకృష్ణకు అవకాశం ఇవ్వబోతున్నాడు గోపీచంద్. ఈ దర్శకుడి గత రెండు సినిమాలు నిర్మించిన యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే అధికారక ప్రకటన ఉండనుంది. మరి ఈసారైనా హిట్ ఇస్తాడో లేదో ఈ దర్శకుడు.