టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవంతో ‘గుణ 369’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘వావ్’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’ తదితర ప్రోగ్రామ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ సంస్థ ఇప్పుడు ఆడియో రంగంలోకి అడుగుపెడుతోంది. ‘జ్ఞాపిక మ్యూజిక్’ టైటిల్ తో ఎంట్రీ ఇస్తున్న ఈ ఆడియో సంస్థను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్. ‘జ్ఞాపిక మ్యూజిక్’ లోగోను ఆవిష్కరించి యూట్యూబ్ చానల్ ప్రారంభించారాయన.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సరైన సమయంలో మార్కెట్‌లోకి వస్తున్న జ్ఞాపిక మ్యూజిక్ చక్కని విజయాలు సాధించి సినిమా వారికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ప్రవీణ కడియాల మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో కూడా మా జ్ఞాపిక మ్యూజిక్ ను ప్రారంభించాలి అని అడగగానే మా ఇంటికి వచ్చిమమ్మల్ని ఆశీర్వదించిన విజయేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజు ప్రారంభమైన మా జ్ఞాపిక మ్యూజిక్‌లో సినిమా పాటలతో పాటు, ప్రవేట్ సాంగ్స్, భక్తిగీతాలు, వీడియో సాంగ్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాం. అలాగే కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో ఈ మ్యూజిక్ రంగంలో అడుగు పెడుతున్నాం’’ అన్నారు.