అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడి, జులై 11వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఆ రోజు కూడా రిలీజ్ చేయడం లేదని తాజాగా ఘాటి టీం నుంచి ప్రకటన వచ్చింది. సినిమా అనేది ఒక భార్య నది లాంటిదని, ఒక్కోసారి అది వేగంగా పరిగెత్తుతుందని, ఒక్కోసారి లోతు పెంచుకోవడం కోసం నిలకడగా ఉండిపోతుందని చెప్పుకొచ్చారు.
Also Read:Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!
అలాగే, ఘాటి కేవలం సినిమా మాత్రమే కాదని, అది ప్రకృతిలో ఒక భాగమని వారు తెలిపారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా మార్చేందుకు మేము ఇంకా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని, సినిమా మీద ఉన్న మీ ప్రేమకు, మీ సహనానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సినిమా అవుట్‌పుట్ మంచిగా వచ్చిన తర్వాతే మేము రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజీవ్ రెడ్డి, సాయిబాబా గుడి నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.