టాలీవుడ్ లో మరో కొత్త మ్యూజిక్ కంపెనీ ఎంటర్ అవుతోంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని సంస్థ జెమినీ రికార్డ్స్ పేరుతో మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోంది. గత 75 సంవత్సరాలుగా జెమిని గ్రూప్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రయాణం చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా జెమిని గ్రూప్ జెమిని రికార్డ్స్
ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక టాలీవుడ్ లో సినిమా పాటల హక్కులను తీసుకోవడంతో పాటు…. ఆల్బమ్స్ రూపకల్పనలోనూ పాల్గొననుంది. స్వతంత్ర సంగీత కళాకారులతో ఆల్బమ్స్ రూపొందించటమే కాకుండా… జెమిని రికార్డ్స్ పేరుతో సినిమాల మ్యూజిక్ హక్కులు కూడా తీసుకోనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. చెన్నైతో పాటు హైదరబాద్ లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగనున్నాయి.