క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మేరకు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్ అంజలి మంచి హిట్ అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఇదిలా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నెల లోపే ఓటిటిలోకి వచ్చింది.’గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని మే 8 స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. కానీ సాయంత్రం అయ్యేవరకు కూడా ఈ సినిమా ఓటిటికి రాకపోవడంతో ఈ సినిమా వస్తుందా రాదా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది .అయితే ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది.