Site icon NTV Telugu

Gayathri Gupta: బయట వర్షం.. లోపల సెగలు.. సింగిల్ గా ఉన్నానంటూ నటి షాకింగ్ ఫొటోస్

Gayathri Gupta

Gayathri Gupta

ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో కనిపించిన గాయత్రీ గుప్త గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయకపోయినా సోషల్ మీడియాలో తనదైన శైలిలో కామెంట్లు పెడుతూ పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టింది. అందులో ఆమె తాను ఇప్పుడు ఓవులేటింగ్ లో ఉన్నానని, మరోపక్క వర్షం పడుతుందని, కానీ సింగిల్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:Pakistan: పాకిస్థాన్‌లో పేలిన కొత్త రకం బాంబు..

కొన్నిసార్లు దీని కోసమైనా పరితపించడమే అమేజింగ్ గా ఉంటుందంటూ ఆమె రాసుకొచ్చింది. ఏదైనా ఈజీగా దొరికేయడం కంటే డెస్పరేషన్ ఉంటేనే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందంటూ ఆమె రాసుకొచ్చింది. ఒకరకంగా ఇది బోల్డ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ కి కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నేటిజెన్లు. కొంతమంది ఆమె బోల్డ్‌నెస్ కి ఇంప్రెస్ అవుతుంటే కొంతమంది మాత్రం ఇలా బరితెగించావ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version