Lakshya for Needy : గుర్తుకొస్తున్నాయి.. సంగీతంతో సేవ.. బాలికల భవిష్యత్తుకు మీ చేయూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు శానిటరీ హైజీన్ కిట్లను అందించాలనే లక్ష్యంతో ‘గుర్తుకొస్తున్నాయి – మ్యూజిక్ ఫర్ ఎ కాజ్’ పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. సంగీతాన్ని సామాజిక సేవతో మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం జూలై 18న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమంలో జరగనుంది.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించే ప్రతి టికెట్ ఆదాయం అవసరమైన బాలికలకు మూడు నెలల పాటు సరిపడే హైజీన్ కిట్లను అందించేందుకు వినియోగించనున్నారు. “ఒక టికెట్ – ఒక బాలికకు మూడు నెలల శానిటరీ హైజీన్ కిట్” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ముందుకు తీసుకెళ్తున్నారు. శానిటరీ ప్యాడ్స్ విలాసవంతమైన వస్తువు కాదని, ప్రతి మహిళకు అవసరమైన ప్రాథమిక హక్కు అనే సందేశాన్ని సమాజానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
సామాజిక బాధ్యతతో పాటు సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించే ఈ ఈవెంట్లో పలువురు సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన జీవనానికి చేయూత అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులతో ఈ సమాచారాన్ని పంచుకోవడంతో పాటు కార్యక్రమానికి హాజరై తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. ప్రతి చిన్న సహాయం కూడా ఒక బాలిక జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు తెలిపారు. టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు District by Zomato మరియు Socioo.in వేదికల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ సమాజానికి మేలు చేసే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ‘లక్ష్య ఫర్ నీడి’ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..