Tollywood: ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అయ్యాక సక్సెస్ మీట్ లు నిర్వహించటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఆయా సక్సెస్ మీట్లకు ఆ నిర్మాతకు, దర్శకుడికి లేదా హీరోకి సన్నిహితులైన దర్శకులను, ఇతర నటులను పిలవడం కూడా కామన్ అయింది. ఇదంతా బానే ఉంది కానీ తన కెరీర్ లో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టి… ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాతో ఇంకా కుస్తీలు పడుతున్న ఒక సినిమా డైరెక్టర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఏ సినిమా సక్సెస్ మీట్ లో అయినా మనోడి పేరు వినపడాల్సిందే, పోనీ మనవాడు ఏమైనా పూర్తిస్థాయి సినిమా లవర్ అయి ఆ సినిమా చూసి వస్తాడా అంటే అది లేదు.
GST ఎఫెక్ట్.. రూ.1.30 లక్షల మేర తగ్గిన Maruti Suzuki కార్ల ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదిగో!
సినిమా చూడకుండా ఏదో సినిమాని పొగిడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వెంటనే సినిమా టీమ్స్ దాన్ని కామెడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రహసనంలా మారింది. నిజంగా సినిమా చూసిన దర్శకులను, నిర్మాతలను లేక హీరోలను పిలిచి ఆ సినిమా గురించి మాట్లాడమంటే సినిమాకి ఏమైనా హైప్ రావచ్చు కానీ సినిమా చూడకుండా ఎప్పుడో ఒక హిట్ ఇచ్చి సైలెంట్ అయిన డైరెక్టర్ ను ప్రతిసారి స్టేజ్ మీదకు పిలిచి తమ సినిమాను కామెడీ చేసుకోవడం ఎందుకు?. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.
Turkey: ఎర్డోగాన్‌కు ఇండియా దెబ్బ.. టర్కీ శత్రువుతో భారత్ రక్షణ ఒప్పందం..