Site icon NTV Telugu

Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా

Untitled Design (23)

Untitled Design (23)

తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుంది ఈ సీనియర్ నటి. ఆ తర్వాత నటుడు కమల్ హాసన్ తో 2004 నుండి 2016 వరకు సహజీవనం చేస్తూ ఆ బంధానికి స్వస్తి పలికింది. మధ్యలో కాన్సర్ బారిన పడినా కుంగిపోక దైర్యంగా క్యాన్సర్ ను జయించి అడపా దడపా పలు చిత్రాలలో కనిపించింది.

కొన్నేళ్ల బ్రేక్ తర్వాత కమల్ హాసన్ నటించిన గౌతమి ఆ చిత్రం సూపర్ హిట్ తో వరుసగా వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులోనూ పలు చిత్రాలలో నటించింది. మలయాళ నటుడు మోహన్ లాల్ తో కలిసి మనమంతా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది గౌతమి. మరోవైపు గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ తీసుకుంటున్నట్టు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ భామ నిత్యం తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారును హుషారెత్తిస్తుంది. అతి త్వరలోనే సుబ్బలక్ష్మి వెండితెరకు పరిచయం కాబోతుందని తెలుస్తోంది. మరి తెలుగులో ఎంట్రీ ఇస్తుందా లేక తమిళ్ ఇండస్ట్రీ నుండి అరంగేట్రం చేస్తుందా అనే సంగతి రానున్న రోజుల్లో తేలనుంది.

 

Also Read : DoubleI Ismart: క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..

Exit mobile version