Swathi Mutyam: గణేశ్ బెల్లంకొండ అరంగేట్రంకు డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చిదిద్దారని అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ”’స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ సినిమా. ప్రేమ, పెళ్లి, జీవితం గురించిన ఆలోచనలు, అభిప్రాయాల నడుమ ఆ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే కథ. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి” అని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలను సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద పోషించారు.
Also Read
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్‌తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
విశేషం ఏమంటే… ఈ యేడాది స్వాతంత్రదినోత్సవ కానుకగా ఇప్పటికే ఐదు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఆ మర్నాడు ఆగస్ట్ 12న అఖిల్ ‘ఏజెంట్’తో పాటు సమంత ‘యశోద’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, విశాల్ ‘లాఠీ’ రాబోతున్నాయి. ఇప్పుడు తాజాగా 13వ తేదీన ‘స్వాతి ముత్యం’ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. మరి ఇందులో ఏ సినిమాలు అనుకున్న విధంగా రిలీజ్ అవుతాయి, ఏవి వాయిదా పడతాయి అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్‌గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!