NTV Telugu Site icon

Dil Raju: తెలంగాణలో గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెరిగాయ్.. కానీ?

Dilraju (2)

Dilraju (2)

గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు బ్రేకులు పడ్డాయి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్ లో పెంపు కూడా ఉండదు అనే చర్చ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే గతంలో పుష్పా 2 విషయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకమీదట తాను సీఎంగా ఉండగా టికెట్ రేట్లు పెంచేది లేదని బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటించారు. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన దిల్ రాజు మాత్రం సినీ పరిశ్రమకు సీఎం మంచి చేస్తానని చెప్పారని తన ప్రయత్నం తాను చేస్తానని అన్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఒక మెమో రిలీజ్ చేసింది.

Tirupati: విష్ణు నివాసం దగ్గర తీవ్ర తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు దుర్మరణం

ప్రభుత్వం జీవో నెంబర్ 120 ప్రకారం సినిమా బెనిఫిట్ షో కి మాత్రం అనుమతి నిరాకరించారు. అయితే పదో తారీకున సినిమా ఆరు షోస్ వేసుకునే పర్మిషన్ ఇచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి షోస్ వేసుకునే అవకాశం కల్పించారు. సినిమా టికెట్ రేట్ మీద 150 రూపాయలు జీఎస్టీ తో కలిపి మల్టీప్లెక్స్ కి, వంద రూపాయలు సింగిల్ థియేటర్లకు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించారు .11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సుమారు తొమ్మిది రోజులపాటు మల్టీప్లెక్స్ లకు వంద రూపాయలు, సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు 50 రూపాయలు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించారు. మొత్తానికి బెనిఫిట్ షోలకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. అయితే టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో మాత్రం కాస్త ఊరట కల్పించింది అని చెప్పొచ్చు.

Show comments