NTV Telugu Site icon

Game Chanager : టికెట్స్ బుకింగ్ లో జోరు చూపిస్తోన్న గేమ్ ఛేంజర్

Gamechanger

Gamechanger

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. తమిళ నటుడు S. J సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ ఛేంజర్.

Also Read : DaakuMaharaaj : బాలయ్యలో నాకు అది కనిపించలేదు : శ్రద్ధా శ్రీనాథ్

గేమ్ ఛేంజర్ కు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరల పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. కాగా ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో బుధవారం రాత్రి ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు. అయితే టికెట్స్ ఇలా పెట్టడం ఆలస్యం అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా నైజాం వంటి ఏరియాలలో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తోంది. నైజాంలో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక మొదటి రోజు తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గేమ్ ఛేంజర్ ను ప్రదర్శించేలా ప్లాన్ చేసారు. RRR తర్వాత వస్తుండడం, దాదాపు 5 ఏళ్ల తర్వాత చరణ్ సోలో రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ఏపీలోనూ గేమ్ ఛేంజర్ బుకింగ్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గేమ్ ఛేంజర్ భారీ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Show comments