Site icon NTV Telugu

Game Changer: దెబ్బకు దిగొచ్చారు.. ఇక ఆ బూతు పంచాంగం ఆపేయండ్రా అబ్బాయిలూ!

Game Changer Update

Game Changer Update

Game Changer Team Getting Ready after Twitter Trending With Cuss Words: రోజులు కాదు, నెలలు కాదు, ఏండ్లకేండ్లు వెయిట్ చేయడమంటే.. స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే. అందులో మెగా ఫ్యాన్స్ అంటే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్‌తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగాభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం.. వాళ్లకు నిజంగానే చిర్రెత్తెలా చేసింది. అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి రెండు పోస్టర్స్‌, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో.. గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సారి మాత్రం మేకర్స్‌కు గట్టిగానే ఇచ్చుకున్నారు. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా శంకర్‌తో పాటు నిర్మాణ సంస్థపై నెగెటివ్ ట్యాగ్స్‌ ట్రెండ్ చేస్తూ.. లిటరల్ గా చెప్పాలంటే బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో.. మెగా ఫ్యాన్స్‌ కాస్త శాంతించండని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్‌గా ఒక పోస్ట్ పెట్టాడు.

Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!

‘అసభ్యకర కామెంట్లు, నెగిటివిటీని ట్రెండ్ చేస్తే ఉపయోగం ఏంటి? దాని వల్ల సినిమా ఇమేజ్ దెబ్బతింటుంది.. బ్యాడ్ కామెంట్స్ మమ్మల్ని బాధ పెడతాయి.. ఈ నెలలోనే అప్డేట్ ఉంటుంది..’ అంటూ ట్వీట్ చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయక చవితి 2024’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. దీనికి సై అన్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అంటే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా.. గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని కన్ఫామ్ అయిందన్నమాట. అయితే.. ఫ్యాన్స్ అడిగినట్టుగా గేమ్ ఛేంజర్ టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా? లేదంటే కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా.. నిర్మాత దిల్ రాజు బల్లగుద్ది మరీ డిసెంబర్‌లో రిలీజ్ అంటున్నాడు కాబట్టి.. మెగా ఫాన్స్, అబ్బాయిలూ మిమ్మల్నే, ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ పై నెగెటివ్ ట్రెండ్‌ను ఆపేస్తే బెటర్. మరి.. నిజంగానే మేకర్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇస్తారా? లేకపోతే మళ్లీ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తారా? అనేది చూడాలి.

Exit mobile version