Game Changer: గేమ్ ఛేంజెర్ రన్ టైం లాక్.. సెన్సార్ టాక్ షేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ స్సీడప్ చేశారు మేకర్స్. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ జనవరి 4న లేదా 5న రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది గేమ్ ఛేంజర్.
Also Read : Bheems Ceciroleo : టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్..
Also Read
సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. రన్ టైం వచ్చేసి దిల్ రాజు చెప్పినట్టుగా 2 గంటల 45 నిమిషాలుగా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సెన్సార్ టాక్ అదిరిపోయినట్టుగా సినీ సర్కిల్స్ లో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బావుందని. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ హై ఇస్తుందని, ముఖ్యంగా ఓ 20 నిమిషాలు పాటు ఉండే ట్రైన్ ఎపిసోడ్ మామూలుగా లేదని తెలిసింది. ఇక ఇంటర్వెల్ తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ అయి సెకండాఫ్‌ని శంకర్ పరుగులు పెట్టించాడని అంటున్నారు. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదట. మొత్తంగా గేమ్ ఛేంజర్ సెన్సార్ టాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అన్నట్టుగా ఉంది. శంకర్ ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ అయినట్టేనని అంటున్నారు. ఆల్రేడీ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి గేమ్ ఛేంజర్ చూశారట. వాళ్లు ఇచ్చిన రివ్యూస్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని మెగాస్టార్ చెప్పేశారు. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా అదిరిపోవడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి