NTV Telugu Site icon

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్

Gamechanger

Gamechanger

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా సాంగ్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే మొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి రికార్డ్ క్రియేట్ చేశారు గేమ్ ఛేంజర్ మేకర్స్. ఇక్కడితో ప్రమోషన్స్ స్పీడప్ చేసి విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ చేశారు. ఆ తర్వాత హైదరబాద్‌లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు.

Also Read : NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే

ఇక ఇప్పుడు ఏపీ రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఈవెంట్‌తో సినిమా హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. ఇలా మేకర్స్ గేమ్ ఛేంజర్‌ను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తుండగా ఓ  విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గేమ్ ఛేంజర్‌కు ఉన్న క్రేజ్‌కు అన్ని భాషల్లోను సాలిడ్ ప్రమోషన్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తమ హీరో సినిమాకు ప్రమోషన్స్ చేయడం లేదని చరణ్ ఫ్యాన్స్ మరీ మరీ అడుగుతున్నారంటే అక్కడ గేమ్ ఛేంజర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Show comments