GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
Also Read:Bad Girlz: ‘ఇలా చూసుకుంటానే’ అంటున్న ‘బ్యాడ్ గాళ్స్’
ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి గారు మాట్లాడుతూ.. ” ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులు కూడా జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా” అని అన్నారు. జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారు మాట్లాడుతూ.. ” గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు గారు ఈ అవార్డ్ ఫంక్షన్ ను ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించేలా సౌరబ్ కేసరి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతో ఈ ఈవెంట్ జరగనుంది” అని చెప్పారు.
