Site icon NTV Telugu

Gaddar : రిలీజ్ కు సిద్ధమైన గద్దర్ నటించిన చివరి సినిమా..

Untitled Design (100)

Untitled Design (100)

విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం ” ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేస్తున్నారు. జాతీయ ఉత్తమ ప్రముఖ దర్శకులు నిర్మాత బి.నర్సింగరావు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ ప్రముఖులు సంయుక్తం గా పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ నిర్ణయించి ప్రకటించారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.

Also Read: Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?

ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి మాట్లాడుతు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా, భూనిర్వశితులకి న్యాయం కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాని ఒక గ్రంధంలా, కళా ఖండంలా మూడు సంవత్సరాలు పాటు ఎంతో కస్టపడి నిర్మించామని నిజమైన స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులు, ఎంతోమంది మేధావులు,కవులు కళాకారుల, రచయితలు కూడా ఈ చిత్రం లో నటించారని తెలిపారు. ఢిల్లీ ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ లొకేషన్ లలో షూటింగ్ చేశామని చెప్పారు. ఈ ఆగస్టు నెల 30 వ తేదిన ప్రపంచం వ్యాప్తంగా రెండు వందల దియోటర్ల పైగా విడుదల చేస్తున్నట్లు సత్యారెడ్డి తెలిపారు.

Exit mobile version