Gaddar Awards: గద్దర్ సినీ అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం నిన్న ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు జ్యూరీగా వ్యవహరిస్తూ, వచ్చిన అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అవార్డులను అందించడానికి కృషి చేయనున్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ వ్యవహరిస్తుండగా, మెంబర్ కన్వీనర్‌గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి నియమితులయ్యారు.
Devi Sri Prasad: విశాఖలో దేవి శ్రీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంపై ఉత్కంఠ.. అసలు ఏమవుతోంది?
Also Read
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
వీరితో పాటు, జీవిత రాజశేఖర్, దర్శకులు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్, ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వి.ఎన్. ఆదిత్య కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే, విజయ్ కుమార్ రావు అనే ఎగ్జిబిటర్, లక్ష్మీనారాయణ, జి. వెంకటరమణ (అలియాస్ జీవి) అనే జర్నలిస్టులు, ఆకునూరు గౌతమ్ అనే ఫిల్మ్ అనలిస్ట్ కూడా కమిటీలో ఉన్నారు. ఇంకా, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఏడిద నాగేశ్వరరావు కుమారుడు నిర్మాత ఏడిద రాజా కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తం 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Gaddar Awards
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!