NTV Telugu Site icon

G.O.A.T : రెండు రోజుల్లో రిలీజ్.. హైప్ నిల్.. బుకింగ్స్ ఫుల్.. ఇదెక్కడి విడ్డూరం

Untitled Design (1)

Untitled Design (1)

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న చిత్రం GOAT( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. కానీ ఈ చిత్రం రిలీజ్ కాబోతుందన్న విషయం కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. విజయ్ గత చిత్రాలు లియో, బీస్ట్ సినిమాలు తెలుగు రిలీజ్ కి భారీ హైప్ వుంది. కానీ గోట్ విషయంలో అంత బజ్ రావట్లేదు.

Also  Read: AAY : 16 రోజులు.. కేక పుట్టించిన కలెక్షన్స్.. సక్సెస్ పార్టీ కి ‘ఆయ్’ టీమ్ రెడీ..

కానీ ఈ చిత్ర బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో వెళుతున్నాయి. ఈ సినిమా USA అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే షాక్ అవడం గ్యారంటీ. ప్రస్తుతానికి US బాక్సాఫీస్ వద్ద GOAT ప్రీమియర్ షోస్ రూపంలో $470K  వసూలు చేసి రికార్డు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే విజయ్ గత చిత్రం బీస్ట్ ను దాటేసింది. లియో తర్వాత విజయ్‌కి ఇది రెండవ అతిపెద్ద ఓపెనింగ్. ఇటు తమిళనాడులో కూడా, బుకింగ్‌లు వేరే లెవల్ లో ఉన్నాయి. GOAT తమిళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ టాప్ 3 ఓపెనింగ్స్‌ను రాబడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు తెలుగులోను అదిరిపోయే ఓపెనింగ్ రానుంది. కాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను రూ. 23 కోట్లకు కొనుగోలు చేసారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. విజయ్ గత సినిమాల రికార్డులను G.O.A.T బద్దలు కొడుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలుతుంది.

Show comments