Site icon NTV Telugu

Upasana: బ్రెస్ట్ క్యాన్సర్‌ అవేర్నెస్ క్యాంపెయిన్ అంబాసిడర్ గా ఉపాస‌న

Upasana

Upasana

హెల్త్ కేర్ టెక్నాల‌జీలో అగ్ర‌గామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వ‌ర‌గా గుర్తించండి, త్వ‌ర‌గా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్ర‌చారం ప్రారంభించింది. అపోలో హాస్పిట‌ల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌ప‌ర్స‌న్ ఉపాస‌నా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించి, దాన్ని త్వ‌ర‌గా గుర్తించాల్సిన అవ‌స‌రంపై ఈ ప్ర‌చారం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 24 న‌గ‌రాల్లో ఈ ప్ర‌చారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు అవగాహన కల్పించనున్నారు. ఈ సంద‌ర్భంగా అపోలో హాస్పిట‌ల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌ప‌ర్సన్ ఉపాస‌న కామినేని కొణిదెల మాట్లాడుతూ మహిళలు భయపడకుండా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక.

Also Read:Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో పాముల కలకలం?

ఈ రోజు మనం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టుతున్నాం. టెక్నాలజీని సాధారణ మహిళల జీవితాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను ఒక ఉద్యమంగా మార్చే మొదటి అడుగు ఇది. భారత్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతోంది. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. భారత మహిళల్లో 50 శాతం మందికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ లేటు స్టేజ్ గుర్తించబడుతుంది. ఇది ముఖ్యంగా స్క్రీనింగ్ తగిన సేవలు లేని సముదాయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా ట్రైన్డ్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇప్పుడు నేరుగా మహిళల వద్దకు వెళ్లనున్నారు.

Also Read:Allu Arjun -NTR – Ram Charan: ముగ్గురు మొనగాళ్లు.. తెలియకుండానే చేస్తున్నారా?

నిర్మాణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలోని బస్తీలు, తక్కువ ఆదాయ గల కుటుంబాల వద్దకు వెళ్లి సేవలు అందించనున్నారు. దేశంలో 24 రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల మహిళలకు ఈ సేవలు అందనున్నాయి. తమిళనాడు అరగొండలోని పైలెట్ ప్రోగ్రమ్ ద్వారాఅనేక మహిళలకు సేవలు అందించగలిగాం. దీని ద్వారా 150 ప్రాణాలు కాపాడగలిగాం. ఇది చారిటీ కాదు మా బాధ్యత. సెల్ఫ్ ఎగ్జామ్స్ అనేది చెడుగా భావించాల్సినవి కాదు. మనము బ్లడ్ షుగర్ గురించి ఎంత సాదారణంగా మాట్లాడగలగుతుమో అలాగే బ్రెస్ట్ హెల్త్ గురించీ మాట్లాడాలి. అవగాహన కల్పించాలి. డాక్టర్లు, జర్నలిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, కమ్యూనిటీ లీడర్లు..మీ అనుభవాలను షేర్ చేయండి. ఒక మార్పు ప్రారంభం కావాలి. అపోలో ఫౌండేషన్‌లో పని చేయడం, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దయచేసి మహిళలు ముందుగా స్క్రీనింగ్ చేయించుకునేలా ప్రోత్సహించండి. అందరికీ నా ధన్యవాదాలు.

Exit mobile version