కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ పది నెలల కాలంలో అరడజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో ఫోర్ ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశాయి కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాస్టర్లుగా నిలిచాయి. ఈ నాలుగు సినిమాల్లో ముగ్గురు ప్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది కర్లింగ్ హెయిర్ గర్ల్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రాక్షసుడు తర్వాత అతడి ఖాతాలో హిట్టే లేదు. అల్లుడు అదుర్స్, ఛత్రపతి హిందీ రీమేక్, భైరవం ప్లాపులుగా నిలిచాయి. కిష్కిందపురితో బెల్లంకొండను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది అను.
Also Read : BaahubaliTheEpic : SS రాజమౌళి ‘బాహుబలి’ ఎపిక్ రివ్యూ..
బైసన్ తన తొలి సినిమా అంటూ ధ్రువ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు కలెక్షన్లపై ప్రభావితం చేయలేకపోయాయి. మారి సెల్వరాజ్ దర్వకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా తమిళంలో మంచి వసూళ్లను సాధించింది. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 55 కోట్లను క్రాస్ చేసి ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్ వేసింది. అంతకు ముందు నటించిన ఆదిత్య వర్మ, మహాన్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ చవిచూశాయి. ధ్రువ్‌తో లవ్ ట్రాక్ నడుపుతుందన్న రూమర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కిష్కింధ పురి అండ్ బైసన్‌కు మధ్యలో రిలీజైన మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకొంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన పెట్ డిటెక్టివ్ ఇప్పటి వరకు రూ. 20 కోట్లను వసూలు చేసింది. షరీఫ్ యూ ధీన్ ఇటు హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. షరీఫ్ అంతకు ముందు నటించిన ఫిల్మ్ సంశయం కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇలా ముగ్గురి హీరోల పాలిట లేడీ లక్కుగా అవతరించింది అనుపమ.