BaahubaliTheEpic : SS రాజమౌళి ‘బాహుబలి’ ఎపిక్ ఓవర్సీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్ క్రియేట్ చేస్తోంది. బాహుబలి ఎపిక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తూ దూసుకెళ్తోంది. తెలుగు స్టేట్స్ కంటే ఒకరోజు ముందు ఓవర్సీస్ లో రిలీజ్ అయింది బాహుబలి. మరి ఎపిక్ రివ్యూ ఎలా ఉందొ చూద్దామా..
ఫస్ట్ హాఫ్ : ఎపిక్ టైటిల్ కార్డ్ తోనే మనం రొటీన్ రెగ్యులర్ రీరిలీజ్ చేయడం లేదని అర్ధం అవుతుంది. అక్కడి నుండి మిమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వదు. క్రిస్పీ ఎడిటింగ్ తో సినిమాను జెట్ స్పీడ్ లో పరిగెత్తించాడు జక్కన్న. పదేళ్ల తర్వాత కూడా అదే సౌండ్ అంతే అద్భుతమైన క్వాలిటీ. ముఖ్యంగా మహేంద్ర బాహుబలి మొదటిసారి మాహిష్మతిలోనికి ప్రవేశించినప్పుడు మరియు భల్లాలదేవుడి గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఫైట్ సమయంలో వచ్చే సీన్స్, మ్యూజిక్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. అనుష్క ఎంట్రీ సీన్ కు సూపర్బ్. ఇక కట్టప్ప బాహుబలిని పొడవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
సెకండ్ హాఫ్ : ఫస్టాఫ్ ను రేసీగా నడిపిన జక్కన సెకండాఫ్ లో డ్రామా, యాక్షన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ టచ్ తో పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసారు. అమరేంద్ర బాహుబలి అనే నేను ఎపిసోడ్, తలను నరికే సన్నివేశం ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ మీరు ఊహించలేని గూస్ బమ్స్ తెప్పించే ఫీల్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నెవర్ బిఫోర్ ఎక్సపీరియన్స్ ఇచ్చే సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాన్ని వెండితెరపై కచ్చితంగా చూడాల్సిన సినిమా.
ఫైనల్లీ : BaahubaliTheEpic సెల్యులాయిడ్ పై రాజమౌళి సృష్టించిన అద్భుతం.. తప్పకుండా చూడవలసిన చిత్రం.
Rating : 4/5
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!