Site icon NTV Telugu

ChandraHass : ఆటిట్యూడ్ స్టార్ ‘రామ్ నగర్ బన్నీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Untitled Design (7)

Untitled Design (7)

ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అనేక సీరియల్స్ కు దర్శకత్వం వహించి తన ఇంటి పేరును కాస్త ఈటీవీ ప్రభాకర్ గా మార్చుకున్నాడు ప్రభాకర్.  ఆ తర్వాత టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నేళ్లు రానించాడు. ఇటీవల సినెమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేసేపనిలో ఉన్నాడు.  ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి కుమారుడు చంద్రహాస్ ను మీడియాకు పరిచయం చేసాడు ప్రభాకర్ . ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ హావభావాలు, మాట్లాడే విధానం, యాటిట్యూట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకుండానే ఆటిట్యూడ్ స్టార్ అనే బిరుదు అందుకున్నాడు చంద్ర హాస్.

Also Read : Thalapathy69 : విజయ్ చివరి సినిమా ఫుల్ డీటైల్స్ ఇక్కడ చదవండి..

ఇక ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందించిన ‘అరే అమ్మాయిలు.. అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే ..’ అంటూ సాగే ఈ సింగిల్ లో తన స్టెప్పులతో అలరించాడు చంద్రహాస్. ఇక ఈ పాట కూడా ఈ  ఆటిట్యూడ్ స్టార్ స్టార్ పాడటం విశేషం. కాగా, ఈ చిత్రానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్నారు.

Exit mobile version