తమకు వేతనాలు పెంచకపోతే సమ్మెకు దిగుతామని ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్, అన్నట్టుగానే సమ్మెకు దిగి, సుమారు రెండు వారాలకు పైగా షూటింగ్‌లు జరపకుండా, వారికి కావలసిన డిమాండ్‌ను నెరవేర్చుకున్నారు. అయితే, డిమాండ్ చేసిన మేరకు వేతనాలు పెంచకపోయినా, నిర్మాతలు గట్టిగానే వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఫిలిం ఫెడరేషన్‌లో ఉన్న అన్ని యూనియన్ల వారికి పెంచిన వేతనాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు సంబంధించిన కెమెరా టెక్నీషియన్లకు మాత్రం వేతనాలు సరిగా పెరగలేదని తెలుస్తోంది.
Also Read:Mahavatar Narsimha: దేవుడి సినిమాని గుండెల్లో పెట్టేసుకున్నారు.. 300 కోట్ల ఉగ్ర తాండవం
దీంతో, వారు ఫెడరేషన్ నాయకులను కలిసి, తదనంతరం తమ పరిస్థితిని నిర్మాతల దృష్టికి మరోసారి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. మిగతా వారిలాగా తమకు వేతనాలు పెంచలేదని, తమను అర్థం చేసుకుని వేతనాలు పెంచేలా ఆలోచన చేయాలని, వారు నిర్మాతల దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మిగతా అన్ని విభాగాల టెక్నీషియన్లు, కార్మికులు అందరికీ వేతనాల పెంపు భారీగా లాభం చేకూర్చనుంది. నిర్మాతల మీద అదనపు భారం పడినా సరే, ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
