తమకు వేతనాలు పెంచకపోతే సమ్మెకు దిగుతామని ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్, అన్నట్టుగానే సమ్మెకు దిగి, సుమారు రెండు వారాలకు పైగా షూటింగ్‌లు జరపకుండా, వారికి కావలసిన డిమాండ్‌ను నెరవేర్చుకున్నారు. అయితే, డిమాండ్ చేసిన మేరకు వేతనాలు పెంచకపోయినా, నిర్మాతలు గట్టిగానే వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఫిలిం ఫెడరేషన్‌లో ఉన్న అన్ని యూనియన్ల వారికి పెంచిన వేతనాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు సంబంధించిన కెమెరా టెక్నీషియన్లకు మాత్రం వేతనాలు సరిగా పెరగలేదని…