Feel My Love: స్వచ్ఛమైన ప్రేమకథతో ఐదు భాషల్లో రిలీజ్’కు సిద్ధమైన ‘ఫీల్ మై లవ్’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా అనగానే భారీ యాక్షన్, రక్తపాతం, కత్తులు, తుపాకులే గుర్తొస్తాయి. కానీ ఆ మూస ధోరణిని బ్రేక్ చేస్తూ ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఆ చిత్రమే ‘ఫీల్ మై లవ్’. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.ఎన్. బాలాజీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు హరి ప్రకాష్ ఎం ఈ చిత్రాన్ని కేవలం ఒక రొమాంటిక్ డ్రామాగా మాత్రమే కాకుండా కళ్లు చెదిరే విజువల్ ఫీస్ట్‌గా మలిచినట్లు తెలుస్తోంది. మున్నార్, కొడైకెనాల్, పుదుచ్చేరి, చెన్నై లాంటి అత్యంత రమణీయమైన లొకేషన్లలో షూట్ చేసిన దృశ్యాలు ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ అందాలను ఎం.ఎస్. సతీష్ తన కెమెరా కంటితో అద్భుతంగా బంధించారు.
సినిమా కంటెంట్‌పై ఉన్న విపరీతమైన కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ భారీ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సినిమా వైబ్‌ను అద్భుతంగా కన్వే చేస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఎత్తున ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించి, ఆ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రమోషనల్ టూర్‌కు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఒక ప్రేమకథకు ఈ రేంజ్ పబ్లిసిటీ ప్లాన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ఆదిత్య భాస్కర్, ఐరా జంటగా నటిస్తుండగా.. అమ్ము అభిరామి, మధుసూదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ ప్రేమకథకు ప్రాణం పోసేలా సంగీతాన్ని సమకూర్చారు. ఎడిటర్‌గా అజయ్ మనోజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలబోసి రాబోతున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముస్తాబవుతోంది. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- Anakapalli : అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ‘అనకాపల్లి’ రిలీజ్
- Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?