NTV Telugu Site icon

Dhanush: పడిలేచిన కెరటం..లోకల్ బాయ్ టూ గ్లోబల్ స్టార్

Untitled Design (6)

Untitled Design (6)

తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను పదును పెట్టుకొవడానికి ఉపయోగించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. 2011లో సూపర్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు ధనుష్.

 

2011 వచ్చిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, వై దిస్ కొలవెరి డి పాటతో మ్యూజిక్ లవర్స్, సినీ ప్రేక్షకులను ఊపు ఊపేసాడు ధనుష్. ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డు గెలిచాడు. ఉత్తమ నటుడిగా ఆడుకాలం, అసురన్ చిత్రానికి గాను ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు ధనుష్.

కాగా ధనుష్ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ కు విడాకులు ఇస్తూ కొన్ని నెలల క్రితం ప్రకటించాడు. మరోవైపు సినీప్రయాణంలో శిఖరాలు అధిరోహిస్తున్నాడు ఈ హీరో. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన చిత్రం “రాయన్”.రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం అటు తమిళ్, ఇటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ధనుష్ అభిమానులు పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్.. అటు హాలీవుడ్ లోనూ ది గ్రే మ్యాన్ లో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు చేసుకొంటూ మరెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు ధనుష్

 

Also Read: Dulquer: మరోక ఇంట్రెస్టింగ్ సినిమాలో దుల్కర్..టైటిల్ ఏంటంటే.?