NTV Telugu Site icon

Pushpa 2: గళ్ళ లుంగీ.. గన్‌ విత్ గొడ్డలితో ఫహాద్‌

Fahad Birthday

Fahad Birthday

Fahadh Faasil Look From Puspa 2 Goes Viral: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. బన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్‌ ఈ చిత్రంలో అంతకు మించి ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గళ్ళ లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో…మరో చేతిలో గొడ్డలితో ఫహాద్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Naga Chaitanya- Sobhita Dhulipala: ఇదంతా ముందే తెలుసా?

ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రమోషన్‌ కంటెంట్‌ అంతా అందరిలోనూ అంచనాలు పెంచేలా ఉన్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. రోజురోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. ఇక మరోపక్క రజనీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా వేట్టయాన్ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. బర్త్ డే బాయ్ ఫాజిల్ ఇద్దరు సూపర్ స్టార్లు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది.

Show comments