Facts Beind Actor Prabhas Changing his Name: గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఆయన ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ చాలా పూర్తయింది. కానీ ఈ సినిమా టైటిల్ సహాయం ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఈ రోజు ఉదయం ఆసక్తికరంగా టైటిల్ రిలీజ్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ప్రభాస్ పేరులో ఒక ఎస్ అక్షరం ఎగస్ట్రాగా యాడ్ అయింది. ఇంతకుముందు ‘’పి ఆర్ ఏ బి హెచ్ ఏ ఎస్’’ అనే అక్షరాలు మాత్రమే ఉండగా ఇప్పుడు కొత్తగా చివరి ఎస్ తో పాటు మరొక ఎస్ కూడా యాడ్ అయింది.
Akira Nandan: జూనియర్ పవన్ కళ్యాణ్.. అబ్బా ఏమున్నాడ్రా బాబూ!
దీంతో న్యూమరాలజీ ప్రకారం ప్రభాస్ పేరు మార్చుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ప్రభాస్ టీం ని సంప్రదించే ప్రయత్నం చేయగా అసలు ప్రభాస్ పేరు మార్చుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. పోస్టర్ మీద అలాగే మోషన్ పోస్టర్ వీడియోలో పొరపాటున ఎస్ అనే అక్షరం యాడ్ అయింది అని చెప్పుకొచ్చారు. ప్రభాస్’స్ రాజా సాబ్ అని పేర్కొనబోయి పొరపాటుగా ఎస్ అక్షరం పేరులో కలిసిపోయినట్లుగా రిలీజ్ చేశారని అందుకే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభాస్ కి పేరు మార్చుకునే ఆలోచన కూడా లేదని ఈ సందర్భంగా టీం స్పష్టం చేసింది.