MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MAA: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ ‘మా’ (Movie Artistes Association) అని తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా ‘మా’ పేరును వాడుకుంటూ కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అసోసియేషన్ దృష్టికి రావడంతో, ఈ మోసగాళ్ల పట్ల నటీనటులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని తెలుగు నటీనటులకు ‘మా’ మాత్రమే ఏకైక గుర్తింపు పొందిన సంఘం, కానీ ఇటీవల కొందరు వ్యక్తులు “AP MAA”, “MAA AP” వంటి పేర్లతో నకిలీ గ్రూపులు సృష్టించి, తామే అసలైన అసోసియేషన్ అని నమ్మిస్తున్నారట. అమాయక కళాకారుల నుంచి సభ్యత్వాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ‘మా’ కార్యవర్గం తీవ్రంగా స్పందించింది.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఏకైక సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రమే. “AP MAA” లేదా “MAA AP” పేరుతో ఉన్న సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అవి కేవలం ప్రజలను అయోమయానికి గురిచేయడానికి సృష్టించినవేనని తేల్చి చెప్పింది.* ‘మా’ కార్యాలయం ద్వారా తప్ప, బయట వ్యక్తులు ఎవరైనా సభ్యత్వం కోసం గానీ, విరాళాల కోసం గానీ డబ్బు అడిగితే అది ముమ్మాటికీ మోసమే. అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగిస్తూ, కళాకారులను మోసగిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ‘మా’ హెచ్చరించింది. ఎవరైనా ఇటువంటి నకిలీ సంఘాల ఉచ్చులో పడొద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో ఉన్న ‘మా’ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరింది. టాలీవుడ్ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!