కొత్త పెళ్లి కూరుతు యామి గౌతమ్ తాజాగా చిక్కుల్లో పడింది. ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల సారాంశం. వచ్చేవారం ఈ యంగ్ హీరోయిన్ ను ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఆమెను ప్రశ్నించిన తరువాత వారు ఆ స్టేట్మెంట్ ను రికార్డు చేస్తారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో యామికి ఈ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Read Also : ‘డేటింగ్ చేద్దాం రా!’… అంటోన్న నెట్ ఫ్లిక్స్…
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం యామి తన బ్యాంకు ఖాతా ద్వారా రూ.1.5 కోట్లు అందుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ విషయమే ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ విషయంపై హీరోయిన్ ఇంకా స్పందించలేదు. జూలై 7న ఈ నటిపై దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. యామిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిలిపించడం ఇదే మొదటిసారి కాదు. ఆమెను గత ఏడాది కూడా ప్రశ్నించడానికి పిలిచారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆమె ఈడీ కార్యాలయంలో హాజరుకాలేకపోయింది. ప్రస్తుతం యామి తన భర్త ఆదిత్య ధార్ తో తన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ జంట జూన్ 4న పెళ్లితో ఒక్కటయ్యారు. కరోనా కారణంగా అత్యంత్య ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది. ఒక ఫెయిర్ నెస్ క్రీం యాడ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ తెలుగులో రెండు మూడు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా పేరు రాలేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె బాగా పరిచయం.