ఇద్దరు హీరోయిన్స్ మధ్య క్యాట్ ఫైట్స్ ఎప్పుడూ సెన్సేషన్ అవుతాయి కానీ… ఇద్దరు అందగత్తెలు ఫ్రెండ్స్ అయితే పెద్దగా టాక్ వినిపించదు. జూలై ఒకటి… స్టార్ డాటర్ శివనీ రాజశేఖర్ బర్త్ డే! ఆ సందర్భంగా మరో టాలీవుడ్ డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా తన సొషల్ మీడియా అకౌంట్ లో బర్తే డే విషెస్ తెలిపింది. అంతే కాదు, శివనీ సూపర్ హాట్ న్యూ ఫోటోస్ కూడా షేర్ చేసింది! పనిలో పనిగా ‘మై గార్జియస్ పొడుగుకాళ్ల సుందరి’ అంటూ కితాబునిచ్చేసింది!
ఇన్ స్టాగ్రామ్ లో శివానీ రాజశేఖర్ బర్త్ డే స్పెషల్ పోస్ట్… ఈషా రెబ్బా పెట్టగానే… వేల లైక్స్, వందల కామెంట్స్ మొదలైపోయాయి! చాలా మంది మిస్ రాజశేఖర్ కి బర్త్ డే విషెస్ చెప్పగా కొందరు మాత్రం ‘పిక్స్ సూపర్బ్’ అంటూ మెచ్చుకున్నారు. నిజంగానే శివానీ వెస్ట్రన్ ఔట్ ఫిట్ లో వెరీ ఎలిగాంట్ గా వెలిగిపోయింది!